Telugu CHRISTIAN songs lyrics
నీ పిలుపు పల్లవి : నీ పిలుపు వలన నేను నశించిపోలేదు -
నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు -
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను-
నీ ప్రేమకు సాటి లేదు -
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను-
నీ ప్రేమకు సాటి లేదు
చరణము1: నశించుటకు ఎందరో-వేచి యున్నను -
నేసియింపని నీ పిలుపు నన్ను కాపాడేను -
ద్రోహము నిందల మధ్య లో - నే నడచినను -
నీ నిర్మల హస్తం నన్ను భరియించెను-
యజమానుడా- నా యజమానుడా -
నన్ను పిలచిన యజమానుడా -
యజమానుడా - నా యజమానుడా -నన్ను
నడిపిన యజమానుడా //నీ పిలుపు//
చరణం2: మనుషులు మూసిన - తలుపులు కొన్ని అయినను -
నాకై నీవు తెరచినవి అనేకములు -
మనోవేదనతో నిన్ను విడచి పరుగెత్తినను -
నన్ను వెంటాడి నీ సేవను చేసితివి-
నా ఆధారమా - నా దైవమా-
పిలచిన ఈ పిలుపుకు కారణమా
నా ఆధారమా నా దైవమా-
పిలచిన ఈ పిలుపునకు కారణమా // నీ పిలుపు//
Comments
Post a Comment